logo

బార్లా తెరిచారు

ఉమ్మడి జిల్లాలో బార్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సమయపాలన పాటించటం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బార్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 49 బార్లు, 162 మద్యం దుకాణాలు ఉన్నాయి.

Published : 03 Oct 2022 01:51 IST

నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు

కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో బార్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సమయపాలన పాటించటం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బార్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 49 బార్లు, 162 మద్యం దుకాణాలు ఉన్నాయి. సగటున ప్రతిరోజూ రూ.3.5 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పరిశీలిస్తే (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు) వరకు రూ.636 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త అనుమతులతో బార్లు ప్రారంభమయ్యాయి.కర్నూలులో 18కుగాను 14 బార్లను పాత వ్యాపారులు దక్కించుకోవటంతో యథాస్థానంలో కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు నిర్వహించాల్సి ఉండగా కొందరు ఉదయాన్నే తెరిచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పోటీపడి అధిక మొత్తానికి అనుమతి దక్కించుకున్న నేపథ్యంలో పెట్టుబడితోపాటు లాభాలను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పర్యవేక్షణ అంతంతే..

మద్యనిషేధ, అబ్కారీ శాఖ ఉమ్మడి జిల్లాలో ఏడుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 22 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో వీటిపై దృష్టి సారించలేని పరిస్థితి. ప్రభుత్వ మద్యం దుకాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో బార్ల నిర్వహణపై దృష్టి సారించటం లేదు. పలు బార్లలో కొందరు నేతలు భాగస్వాములుగా  ఉండటంతో వాటిపైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. దీనికితోడు బాహాటంగా చెప్పకున్నా మద్యం అమ్మకాలు పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని