logo

దుష్ట సంహారిణి.. భక్తజన సంరక్షిణి

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సందడి మిన్నంటుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. జుట్టు విరబోసుకుని, చతుర్భుజాలు కలిగిన అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

Published : 03 Oct 2022 01:51 IST

గజ వాహనంపై విహరిస్తున్న పార్వతీ.. పరమేశ్వరులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సందడి మిన్నంటుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. జుట్టు విరబోసుకుని, చతుర్భుజాలు కలిగిన అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ దేవి దుష్టులను శిక్షించి భక్త జనులను రక్షించే శుభంకరిగా పేరుగాంచింది. ఆలయంలో ప్రత్యేక వేదికపై కొలువుదీరిన కాళరాత్రి అమ్మవారికి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకురాగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సభ్యులు, ఈవో ఎస్‌.లవన్న కర్పూర హారతులు ఇచ్చి నారికేళాలు సమర్పించారు. కళాకారులు కోలాటాలు, చెక్కభజనలు, ఢమరుక విన్యాసాలతో ఆకట్టుకున్నారు. కన్నడ యువతులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ దక్షిణ మాడవీధిలో కళాకారులు సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాదస్వరం, భక్తిరంజని కార్యక్రమాలు అలరించాయి.

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీభ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్లకు నందివాహనసేవ జరగనుంది. ఆలయంలో పూజల అనంతరం శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

కాళికా వేషధారణలో కళాకారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని