logo

ఇద్దరు మహిళా దొంగల అరెస్టు

ఇద్దరు అంతర్‌జిల్లా మహిళా దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 90గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 03 Oct 2022 16:32 IST

ఆదోని మార్కెట్‌: ఇద్దరు అంతర్‌జిల్లా మహిళా దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 90గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జులై, నవంబర్‌ నెలల్లో తిమ్మారెడ్డి బస్టాండ్‌, బంగారు బజార్‌ ప్రాంతాల్లో రెండు బంగారు ఆభరణాల అపహరణ కేసులు నమోదయ్యాయన్నారు. దీనిపై విచారించగా ఇద్దరు మహిళల హస్తం ఉందని గుర్తించి డోన్‌ సమీపంలోని హైవే ప్రాంతంలో ఈ ఇద్దరినీ గుర్తించినట్లు చెప్పారు. వీరిని చీరాల ప్రాంతానికి చెందిన నాగమణి, పద్మలుగా గుర్తించినట్లు వివరించారు. సదరు మహిళల ఇళ్లలో సోదాలు నిర్వహించి చోరీ చేసిన 90 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన బంగారాన్ని నిందితులు ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని