logo

బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం

వాల్మీకులను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే సహించబోమని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌, వాల్మీకి ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ డా.మధుసూదన్‌ అన్నారు.

Published : 03 Oct 2022 19:34 IST

ఆదోని మార్కెట్‌: వాల్మీకులను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే సహించబోమని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌, వాల్మీకి ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ డా.మధుసూదన్‌ అన్నారు. సోమవారం స్థానిక వాల్మీకి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు. రాజకీయంలోకి కులాలను లాగడం సరికాదని వాపోయారు.  బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున, వార్డు కౌన్సిలర్లు సుధాకర్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని