logo

భారత్‌ జోడో యాత్రతో భాజపాలో గుబులు

కేంద్రంలో భాజపా అస్తవ్యస్త పాలనతో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర నేపథ్యంలో నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి

Published : 05 Oct 2022 02:32 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌

సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో నేతలు దిగ్విజయ్‌సింగ్‌, జైరాం రమేష్‌, శైలజానాథ్‌, తులసిరెడ్డి తదితరులు

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా అస్తవ్యస్త పాలనతో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర నేపథ్యంలో నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, ఉమెన్‌చాందీ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తులసిరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ తదితరులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వస్తుండటంతో భాజపా నాయకుల గుండెల్లో గుబులు రేగిందని చెప్పారు. విభజించు.. పాలించు నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాపై వైకాపా ప్రభుత్వం, తెదేపా నాయకులు ప్రశ్నించకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గంలో 18వ తేదీన భారత్‌ జోడో యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర యాప్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చన్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశం పూర్తైన తర్వాత పాతబస్తీలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్‌ హాలులో యాత్ర సన్నాహక ఏర్పాట్లపై పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ ఆధ్వర్యంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం యాత్రకు చెందిన పాటను సీడీ రూపంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెయ్యప్పన్‌, కొప్పుల రాజు, కర్నూలు, నంద్యాల డీసీసీ అధ్యక్షులు సుధాకర్‌ బాబు, లక్ష్మీనరసింహ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
యాత్ర కొనసాగుతుందిలా..
* భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ 17వ తేదీ రాత్రి ఆలూరు నియోజకవర్గంలోని ఛత్రగుడిలో బస చేస్తారు. 18వ తేదీ ఉదయం యాత్ర ప్రారంభమై వివిధ ప్రాంతాల మీదుగా 21వ తేదీన మంత్రాలయం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కల్లుదేవకుంట, మంత్రాలయం, చెట్నిహళ్లి, మాధవరం గ్రామం మీదుగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర ముగుస్తుంది. 22వ తేదీన రాయచూర్‌లో యాత్ర ముగించుకొని 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts