logo

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద ఉమ్మడి జిల్లాకు రూ.22.54 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కర్నూలు డీపీవో కార్యాలయానికి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మంగళవారం అధికారిక సమాచారం అందింది.

Published : 05 Oct 2022 02:32 IST

 రూ.22.54 కోట్ల విడుదల

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద ఉమ్మడి జిల్లాకు రూ.22.54 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కర్నూలు డీపీవో కార్యాలయానికి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మంగళవారం అధికారిక సమాచారం అందింది. కర్నూలు జిల్లాలో 484 పంచాయతీలకుగాను ఆదోని మండలం సాదాపురం, మండగిరి పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో 482 పంచాయతీలకు రూ.11.93 కోట్లు విడుదలయ్యాయి.
* నంద్యాల జిల్లాలో 482 పంచాయతీలు ఉండగా సున్నిపెంట పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. మిగిలిన 481 పంచాయతీలకు రూ.10.60 కోట్లు వచ్చాయి. ఈ నిధులు పాత విధానం (సీఎంఎఫ్‌ఎస్‌) ద్వారా జిల్లా ఖజానాకు జమవుతాయని, అనంతరం సంబంధిత సర్పంచుల ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వ ఆదేశించిందని కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు తెలిపారు. ఏ పంచాయతీకి ఎన్ని నిధులు కేటాయించారనే వివరాల జాబితాను ఖజానా శాఖ కార్యాలయానికి పంపుతామని చెప్పారు.
* పాత పద్ధతి ప్రకారం జిల్లా ట్రెజరీ ద్వారా నిధులు విడుదల చేయడాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిదులు ఇస్తే.. అప్పుడు పంచాయతీలకు కాసులు వచ్చే  పరిస్థితి ఏర్పడనుంది. ఈ విధానంతో కథ మళ్లీ మొదటికి వస్తుందని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. అసలు నిధులు చేతికి వస్తాయో.. లేదో అని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని