logo

నివేదికలు పోర్టల్‌లో నమోదు చేయండి

జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు తదితర వివరాలను ఐహెచ్‌ఐపీ(ఇండిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫ్లాట్‌ఫాం) పోర్టల్‌లో నమోదు చేయాలని

Published : 05 Oct 2022 02:32 IST

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు తదితర వివరాలను ఐహెచ్‌ఐపీ(ఇండిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫ్లాట్‌ఫాం) పోర్టల్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య తెలిపారు. మంగళవారం జిల్లా మలేరియా నివారణ అధికారి కార్యాలయంలో పీహెచ్‌సీ, పట్టణ ఆరగ్యకేంద్రాల ల్యాబ్‌ టెక్నీషియన్లతో జిల్లా మలేరియా నివారణ అధికారి నూకరాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జ్వరం కేసుల్లో తప్పనిసరిగా రక్తనమూనాలను సేకరించి  మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. అనుమానిత డెంగీ కేసుల రక్తనమూనాలను ఆదోని ఏరియా ఆసుపత్రి, కర్నూలు వైద్యకళాశాలకు పంపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని