logo

నేడు ఆదోని మార్కెట్‌ యార్డులో ఖుష్‌ ఖరీద్‌

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం ఖుష్‌ ఖరీద్‌(సంతోషకర వ్యాపారం) వ్యాపారం జరగనుంది. ఏటా దసరా పండగ రోజు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. అంతకు ముందు బహిరంగ వేలం ద్వారా, అనంతరం టెండరింగ్‌ విధానం, ప్రస్తుతం

Published : 05 Oct 2022 02:32 IST

మార్కెట్‌ యార్డులో పత్తి దిగుబడులు

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం ఖుష్‌ ఖరీద్‌(సంతోషకర వ్యాపారం) వ్యాపారం జరగనుంది. ఏటా దసరా పండగ రోజు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. అంతకు ముందు బహిరంగ వేలం ద్వారా, అనంతరం టెండరింగ్‌ విధానం, ప్రస్తుతం ఈ-నామ్‌ విధానంలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎంతటి మార్పులు వచ్చినా ప్రాచీనంగా వస్తున్న ఆచారం మాత్రం ఇక్కడి వ్యాపారులు, రైతులు వదులుకోకుండా కొనసాగిస్తున్నారు. నిజానికి దసరా పండగకు మార్కెట్‌కు సెలవు. అయితే రైతులు సైతం పండగ పూట తమ పంట దిగుబడి అమ్ముకుంటే ఇంటికి లక్ష్మీ దేవి వచ్చినట్టుగా భావిస్తారు. వ్యాపారులు సైతం పండగ పూట వ్యాపారం చేయడం ఆరంభ శుభసూచికంగా భావిస్తారు. ఇక్కడ రైతులు తమ పంట దిగుబడులను ధరలతో నిమిత్తం లేకుండా స్వచ్ఛందంగా అమ్ముకోవడం విశేషం. జనంతో మార్కెట్‌యార్డు సందడిగా మారుతుంది. సీజన్‌ ఆరంభానికి ఇదే తొలి అంకంగా భావిస్తారు. ప్రస్తుతం క్వింటాలు పత్తి రూ.9285-రూ.5416, వేరుశనగ రూ.6911-రూ.3459, ఆముదాలు రూ.6588-రూ.6199, పూలవిత్తనాలు గరిష్ఠంగా రూ.4754, కనిష్ఠంగా రూ.4471లు ఉంది.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts