logo

ఏఆర్‌ విభజనలో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు శాఖ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగం విభజన దాదాపు పూర్తయింది. ఎస్కార్ట్‌, బందోబస్తు ఇతరత్రా కీలక బాధ్యతలు నిర్వర్తించే ఏఆర్‌ విభాగానికి సంబంధించి విభజన ప్రక్రియ డీజీపీ ఆదేశాలమేరకు జరిగింది

Published : 05 Oct 2022 02:32 IST

కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు శాఖ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగం విభజన దాదాపు పూర్తయింది. ఎస్కార్ట్‌, బందోబస్తు ఇతరత్రా కీలక బాధ్యతలు నిర్వర్తించే ఏఆర్‌ విభాగానికి సంబంధించి విభజన ప్రక్రియ డీజీపీ ఆదేశాలమేరకు జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఏఆర్‌ విభాగంలో మొత్తం 734 మంది ఉండగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు 54:46 నిష్పత్తిలో విభజించారు. కర్నూలు జిల్లాకు 401 మందిని, నంద్యాల జిల్లాకు 333 మందిని కేటాయించారు. నంద్యాల జిల్లాకు కేటాయించినవారిలో ఆర్‌ఐ-3, ఆర్‌ఎస్సైలు-7, ఏఆర్‌ఎస్సై-24, హెడ్‌ కానిస్టేబుళ్లు-83, కానిస్టేబుళ్లు-216 మంది ఉన్నారు. విభజన ప్రక్రియ కొందరికి మోదం.. మరికొందరికి ఖేదంలా మారింది.  ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఉద్యోగులంతా దాదాపు జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. విభజన ప్రక్రియతో వారిని నంద్యాల జిల్లాకు కేటాయించటం.. పలువురికి మింగుడు పడటం లేదు. మూడుసార్లు అభిప్రాయాలు తీసుకుని తీరా ఇలా చేశారని పలువురు సిబ్బంది వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని