logo

మూడు రాజధానులకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి

రాష్ట్రంలో మూడు రాజధానులకు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి, వాల్మికీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మధుసూదన్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆంజనేయ ఆలయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు విజయం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ వైకాపా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 05 Oct 2022 15:25 IST

ఆదోని మార్కెట్‌ : రాష్ట్రంలో మూడు రాజధానులకు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి, వాల్మికీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మధుసూదన్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆంజనేయ ఆలయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు విజయం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ వైకాపా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి రాజధాని హైదరాబాద్‌ రాష్ట్రవిభజన కారణంగా కోల్పోవడం జరిగిందన్నారు. దీంతో మరోసారి చారిత్రాత్మక తప్పిదాలు జరగకుండా ఉండేందుకు మూడు రాజధానులను తమ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందన్నారు. దీనివల్ల అభివృద్ధి కేంద్రీకరణ జరగకుండా వికేంద్రీకరణ వల్ల ప్రజల మధ్య సఖ్యత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని