logo

ఆదోని మార్కెట్‌ యార్డులో ఖుర్స్‌ ఖరీదు

ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో దసరా సందర్భంగా ఖుర్స్‌ ఖరీదు (సంతోషకరమైన వ్యాపారం) నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని దసరా పండగ పూట నిర్వహిస్తారు.

Updated : 05 Oct 2022 15:26 IST

ఆదోని మార్కెట్‌ : ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో దసరా సందర్భంగా ఖుర్స్‌ ఖరీదు (సంతోషకరమైన వ్యాపారం) నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని దసరా పండగ పూట నిర్వహిస్తారు. పూర్వం బహిరంగ వేలం ద్వారా, అనంతరం టెండర్‌ విధానం, ప్రస్తుతం ఈ-నామ్‌ విధానంలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఈ ఆచారం ద్వారా రైతులు తమ పంట దిగుబడులను మార్కెట్‌లో స్వచ్ఛంద ధరకు అమ్ముకుంటారు. దీనివల్ల పండగ రోజు లక్ష్మీ దేవి తమ ఇంటికి వచ్చినట్లు రైతులు భావిస్తారు. కాగా.. మార్కెట్లో పత్తి గరిష్ఠం రూ.9,011, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని