logo

అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారితో పాటు వేదాంత దేశికన్ స్వామికి నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకం చేశారు.

Published : 05 Oct 2022 17:38 IST

ఆళ్లగడ్డ గ్రామీణం : ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారితో పాటు వేదాంత దేశికన్ స్వామికి నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం విజయదశమి పండుగ సందర్భంగా ప్రహ్లాద వరద స్వామి పారువేటకు బయలుదేరారు. ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన స్వామి జమ్మి చెట్టు వద్దకు చేరుకోగా.. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని