logo

రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

రాయలసీమలో నెలకొన్న కరవును పారద్రోలేందుకు రైతులు చైతన్యవంతులై పెండింగ్‌ ప్రాజెక్టల కోసం ఉద్యమాలు చేయాలని ఆర్‌సీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 05 Oct 2022 19:43 IST

సీ.బెళగల్‌: రాయలసీమలో నెలకొన్న కరవును పారద్రోలేందుకు రైతులు చైతన్యవంతులై పెండింగ్‌ ప్రాజెక్టల కోసం ఉద్యమాలు చేయాలని ఆర్‌సీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తుంగభద్ర నది నీరు 600 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులైన గుండ్రేవుల, వేదవతి, రాజోలిబండ కుడికాలువ, తులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రైతులకు.. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతవాసులకు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజన్న, రాయలసీమ కళాకారుల మండల నాయకుడు రాంచరణ్‌, తదితరులు సభనుద్దేశించి మాట్లాడారు. అంతకుముందు రాయలసీమ ఆర్‌సీసీ జెండాను శ్రీకాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని