logo

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలు తిరగబడతారు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుంటే ప్రజలే తిరగబడతారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ పేర్కొన్నారు.

Updated : 27 Nov 2022 03:57 IST

సంజీవనగర్లో ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుంటే ప్రజలే తిరగబడతారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు అమలు చేయాలంటూ దిల్లీలోని జంతర్మంతర్‌ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శనివారం పట్టణంలోని సంజీవనగర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సీపీఐ జిల్లా సమితి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే కేంద్రలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.  నాయకులు శ్రీనివాసులు, సోమన్న, సుబ్బరాయుడు, హరినాథ్‌, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని