logo

యోగాలో భళా తస్లీమా

ఆదోని పట్టణానికి చెందిన తస్లీమా యోగాలో భళా అనిపిస్తోంది. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్న ఆమె సౌత్‌ జోన్‌ పోటీలకు ఎంపికైంది.

Published : 27 Nov 2022 02:34 IST

సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక

శాప్‌ జిల్లా అధికారితో పతకం అందుకున్న తస్లీమా

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని పట్టణానికి చెందిన తస్లీమా యోగాలో భళా అనిపిస్తోంది. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్న ఆమె సౌత్‌ జోన్‌ పోటీలకు ఎంపికైంది. తండ్రి లారీడ్రైవర్‌గా పని చేస్తూ చదివిస్తున్నారు. చదువేకాదు ఇతర రంగాల్లో ప్రతిభ చాటాలన్న ఉద్దేశంతో కేశవ్‌ మాస్టర్‌ వద్ద కరాటే, యోగా శిక్షణలో తర్ఫీదు తీసుకుంటోంది.

చిన్నప్పటి నుంచే తస్లీమాకు యోగాపై ఆసక్తి ఉండటంతో శిక్షకుడు తీర్చిదిద్దారు. అన్ని రకాల ఆసనాలు సునాయాసంగా వేస్తూ వావ్‌ అనిపిస్తోంది. పాఠశాలలో నిర్వహించే పోటీలతోపాటు వివిధ సందర్భాల్లో ప్రతిభ చాటింది. మండల స్థాయి పోటీలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి జిల్లా పోటీలకు ఎంపికైంది. స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నుంచి కర్నూలు జరిగిన జిల్లా పోటీల్లోనూ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది. అంతకు ముందు గుంటూరు, ఆళ్లగడ్డలో జరిగిన జోనల్‌, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. తాజాగా సౌత్‌ జోన్‌ యోగా పోటీలకు ఎంపికైంది. కేవలం యోగానే కాకుండా చదువులోనూ ముందుంటుంది. 

యోగా విన్యాసాలు చేస్తున్న తస్లీమా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని