logo

వసతి.. ఎన్నాళ్లీ దుస్థితి

సున్నిపెంటలోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా జూనియర్‌ కళాశాల వసతి గృహం సమస్యల నిలయంగా మారింది. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

Published : 28 Nov 2022 03:08 IST

ఇలా తీగలు కలిపితేనే విద్యుత్తు దీపం వెలిగేది

సున్నిపెంటలోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా జూనియర్‌ కళాశాల వసతి గృహం సమస్యల నిలయంగా మారింది. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 120 మంది ఉన్నారు. ప్రధాన గేట్‌ లేకపోవడంతో ఆవులు, పందులు, అడవి పందులు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. స్విచ్‌ బోర్డులు దెబ్బతిన్నాయి. దీంతో రెండు వైర్లను కలిపి విద్యుత్తు దీపం వెలిగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా చేసే సమయంలో విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉన్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సిన దుస్థితి. నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కిటీకీలకు తలుపులు లేకపోవడంతో రాత్రిళ్లు చలికి వణుకుతున్నారు. ఉన్నతాధికారులు వసతిగృహాన్ని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సున్నిపెంట సర్కిల్‌

గేటు లేకపోవడంతో డైనింగ్‌ హాలులోకి వస్తున్న పశువులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు