logo

కత్తి దూసి.. పతకాలు చేపట్టి..

ఒలింపిక్స్‌లో అత్యధిక ర్యాంకింగ్‌ ఉన్న క్రీడ ఫెన్సింగ్‌. కాని ఇది ఖరీదైన ఆట కావడంతో రాష్ట్రంలో దీనికి ఆదరణ తగ్గిపోతోంది. నంద్యాల పట్టణానికి చెందిన అఖిల్‌ ఈ ఆట పట్ల మక్కువతో నేర్చుకున్నాడు.

Published : 28 Nov 2022 03:08 IST

ఫెన్సింగ్‌లో  జాతీయస్థాయిలో అఖిల్‌ సత్తా

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే : ఒలింపిక్స్‌లో అత్యధిక ర్యాంకింగ్‌ ఉన్న క్రీడ ఫెన్సింగ్‌. కాని ఇది ఖరీదైన ఆట కావడంతో రాష్ట్రంలో దీనికి ఆదరణ తగ్గిపోతోంది. నంద్యాల పట్టణానికి చెందిన అఖిల్‌ ఈ ఆట పట్ల మక్కువతో నేర్చుకున్నాడు. నిత్యం గంటల తరబడి సాధన చేస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవాలన్న లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నాడు.

* పట్టణంలోని పద్మావతీనగర్‌కు చెందిన అన్నవరం ప్రసాద్‌, తులశమ్మ దంపతుల కుమారుడు అఖిల్‌. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఆటలంటే మక్కువ. వివిధ క్రీడలు ఆడేవాడు. కుమారుడి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కోచ్‌ లక్ష్మణ్‌ వద్ద ఫెన్సింగ్‌లో శిక్షణ ఇప్పించారు. గత ఏడేళ్లుగా ఈ క్రీడను సాధన చేస్తూ పట్టు సాధించాడు. ఇప్పటి వరకు నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి దేశానికి పేరుతేవాలన్న లక్ష్యంతో రోజులకు 6 గంటల పాటు సాధన చేస్తున్నట్లు అఖిల్‌ చెబుతున్నాడు.

సాధించిన విజయాలు

* 2015లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో బంగారు పతకం.

* 2016లో భోపాల్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రశంసా పత్రం.

* 2017లో ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం.

* 2017లో నల్గొండలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం.

* 2018లో కాకినాడ, రావులపాలెంలో, 2019లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు.

* 2020లో భోపాల్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రశంసాపత్రం.

* 2021లో కాకినాడ, కర్నూలులో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని