logo

వక్ఫ్‌ భూముల సంరక్షణకు కృషి

జిల్లాలో వక్ఫ్‌ భూములను కాపాడతామని వక్ఫ్‌ బోర్డు జిల్లా ఛైర్మన్‌ మియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. జిల్లా ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఆదోనిలో మొదటిసారి పర్యటించిన ఆయన.. స్థానిక వైకాపా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Updated : 28 Nov 2022 15:45 IST

ఆదోని మార్కెట్‌: జిల్లాలో వక్ఫ్‌ భూములను కాపాడతామని వక్ఫ్‌ బోర్డు జిల్లా ఛైర్మన్‌ మియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. జిల్లా ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఆదోనిలో మొదటిసారి పర్యటించిన ఆయన.. స్థానిక వైకాపా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇకపై వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టబద్ధత తెస్తామన్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో కొత్తగా సర్వే చేపట్టి రిజిస్టర్‌  వినియోగించేలా చూస్తామని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేలు, ఎంపీకి కృతజ్ఞత తెలిపారు. వైకాపాతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్‌పర్సన్‌ శాంత, పార్టీ పట్టణాధ్యక్షుడు దేవా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని