logo

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

చిప్పగిరి మండలంలో జరిగిన రెండు చోరీల్లో గుంతకల్లుకు చెందిన శ్రీశైలం, ఉరవకొండ సోమశేఖర్‌ను చిప్పగిరి ఎస్సై మల్లికార్జున సోమవారం అరెస్ట్‌ చేశారు.

Published : 29 Nov 2022 02:19 IST

రూ.1.15 లక్షల నగదు, 13 గ్రాముల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై మల్లికార్జున, పోలీసులు

చిప్పగిరి, న్యూస్‌టుడే: చిప్పగిరి మండలంలో జరిగిన రెండు చోరీల్లో గుంతకల్లుకు చెందిన శ్రీశైలం, ఉరవకొండ సోమశేఖర్‌ను చిప్పగిరి ఎస్సై మల్లికార్జున సోమవారం అరెస్ట్‌ చేశారు. సంగాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు భాస్కర్‌ ఇంట్లో రూ.63 వేలు, ఏడు గ్రాముల బంగారు ఉంగాలు, 2022 జూన్‌ 9న చోరీకి పాల్పడ్డారు. చిప్పగిరి ఎర్రిస్వామి ఇంట్లో 2022 జులై 15వ తేదీన రూ.53 వేల నగదు, ఆరు గ్రాముల రెండు బంగారు కమ్ములు ఎత్తుకేళ్లారు. ఈ రెండు కేసులు విచారణ చేశారు. రెండు దొంగతనాలు చేసిన వారు ఒక్కరే అని ఎస్సై మల్లికార్జున తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటు పడిన ఇద్దరు రూ.లక్షలు అప్పు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్సై వివరించారు. కార్యక్రమంలో ఏఎస్సై నజీర్‌ అహమ్మద్‌, పోలీసులు చంద్ర పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని