logo

బడుగు వర్గాల అభ్యున్నతికి ఫులె కృషి

జ్యోతిరావు ఫులె సేవలు మరువలేనివని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 02:19 IST

 

ఫులె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు, ప్రభుత్వ సలహాదారు సజ్జల, కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జ్యోతిరావు ఫులె సేవలు మరువలేనివని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులె వర్ధంతి పురస్కరించుకుని నగరంలోని బిర్లా గేట్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి అంజాద్‌ బాషాతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, మేయర్‌ బీవై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తదితరులు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఫులె చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ముఖ్యమంత్రి ఫులె అడుగుజాడల్లో నడుస్తూ నవసమాజ స్థాపనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారిణి వెంకటలక్షుమమ్మ, బీసీ సంఘం నాయకులు ఎన్‌.శ్రీనివాసులు, బత్తుల లక్ష్మీకాంత్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని