వైకాపా రైతు ద్రోహి ప్రభుత్వం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా రైతు ప్రభుత్వం కాదని, రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వమని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ జనార్దన్‌రెడ్డి
కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా రైతు ప్రభుత్వం కాదని, రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వమని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. కోవెలకుంట్ల పట్టణంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గతంలో ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందించేవని, ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకు, అధికారుల కనుసన్నల్లో ఉన్నవారికి మాత్రమే పథకాలు ఇస్తున్నారన్నారు. పంటనష్టంలో 20 శాతమే ఇస్తూ అన్నదాతలను మోసం చేస్తున్నారన్నారు. సున్నావడ్డీ పథకం గతంలో రూ.2.5 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.లక్ష మాత్రమేనని నిబంధనలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 1.5 కోట్ల మంది రైతులు 40 నుంచి 50 లక్షల మందికే సున్నావడ్డీ వర్తింపజేశారన్నారు. సున్నావడ్డీని రూ.2.5 లక్షలకు పెంచాలని, రెన్యువల్ ఫీజు ప్రభుత్వమే కట్టాలన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఇన్పుట్ రాయితీలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, వల్లంపాడు ఉపసర్పంచి గార్లపాటి జగదీశ్వరరెడ్డి, కంపమల్ల సుబ్బారెడ్డి, గుల్లదుర్తి పరమేశ్వరరెడ్డి, కలుగొట్ల నాగార్జునరెడ్డి, గడ్డం అమర్నాథరెడ్డి, రాజశేఖర్, విష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి