logo

కట్ట పనులు మట్టి కొట్టుకుపోతున్నాయి

జిల్లాలోని 68 చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమంలో భాగంగా డోన్‌ మండలంలోని వెంకటాపురం చెరువు సామర్థ్యం పెంపు పనులు రూ.10 కోట్లతో చేపడుతున్నారు.

Published : 02 Dec 2022 02:54 IST

మట్టి కట్ట కోతకు గురై ఏర్పడ్డ గండి

జిల్లాలోని 68 చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమంలో భాగంగా డోన్‌ మండలంలోని వెంకటాపురం చెరువు సామర్థ్యం పెంపు పనులు రూ.10 కోట్లతో చేపడుతున్నారు. ఇందులో భాగంగా మట్టి కట్ట నిర్మాణానికి మట్టి పోసి ఎత్తు పెంచారు. ఇందులో కొన్నిచోట్ల వెంకటాపురం వెళ్లే రహదారి పక్కన ఉండే మట్టి కట్ట కోసుకుపోయి పెద్ద గుంతలు పడ్డాయి. ఓ వైపు పనులు చేపడుతుండగానే ఇలా మట్టి కట్ట కోతకు గురవడం విడ్డూరం. పనులు ఇలా చేపడితే ఎలా నాణ్యంగా ఉంటాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏఈ విజయకుమారి మాట్లాడుతూ... చెరువు సామర్థ్యం పెంపు పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదని, అన్ని సక్రమంగా చేపడితేనే బిల్లులు ఇస్తామన్నారు.

- న్యూస్‌టుడే, డోన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని