logo

మల్లన్న ఆలయం భూముల సర్వే పరిశీలన

శ్రీశైల దేవస్థానం భూముల సర్వే పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న గురువారం పరిశీలించారు.

Published : 02 Dec 2022 02:54 IST

సర్వే అధికారులతో చర్చిస్తున్న ఛైర్మన్‌, ఈవో

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల దేవస్థానం భూముల సర్వే పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న గురువారం పరిశీలించారు. శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులను కచ్చితంగా గుర్తించేందుకు దేవస్థానం, అటవీశాఖ, నంద్యాల సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుశాఖ అధికారులు కొన్ని రోజుల నుంచి సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. శ్రీశైలం అటవీశాఖ రేంజ్‌ అధికారి నరసింహులు, జిల్లా సర్వే అండ్‌ రికార్డ్‌ అసిస్టెంట్ డైరెక్టర్‌ పి.హరికృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కె.ఉమాపతి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఎన్‌.నాగశ్రీ, పలువురు సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, విలేజ్‌ సర్వేయర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఛైర్మన్‌, ఈవో వారిని కలిసి సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన రహదారి నుంచి శిఖరేశ్వరం వరకు ఉన్న సీసీ రోడ్డుకు పచ్చిక బయలు ఏర్పాటు చేయాలని ఉద్యాన వనాధికారిని ఆదేశించారు. శిఖరేశ్వర ఆలయ పరిసరాల్లో బిల్వం, కదంబం, ఉసిరి చెట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఈ రామకృష్ణ, డీఈ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని