logo

పాలన చేతకాక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు

అధికారంలో ఉండి ఏమీ చేయలేని సీఎం జగన్‌, వారి 150 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తున్నారని, పాలన చేతకాక సీమగర్జన పేరుతో రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ప్రజలను మోసగించేందుకు చూస్తున్నారని తెదేపా కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 04 Dec 2022 01:13 IST

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: అధికారంలో ఉండి ఏమీ చేయలేని సీఎం జగన్‌, వారి 150 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తున్నారని, పాలన చేతకాక సీమగర్జన పేరుతో రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ప్రజలను మోసగించేందుకు చూస్తున్నారని తెదేపా కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌ విమర్శించారు. శనివారం కర్నూలు మండలం ఈ.తాండ్రపాడు గ్రామంలో మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్‌ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయలసీమకు అన్యాయం చేసింది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డేనని, వారు అధికారంలో ఉన్నప్పుడు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా ట్రైబ్యూనల్‌ కార్యాలయం కర్నూలులో కాకుండా విశాఖపట్నానికి ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలన్నారు. కర్నూలుకు హైకోర్టు కావాలని సీఎం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖైనా రాయలేదన్నారు.  కార్యక్రమంలో నాయకులు సత్రం రామకృష్ణుడు, సత్యనారాయణ, సయ్యద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని