logo

106 గ్రామాల్లో మంచినీటి పరీక్షలు

జిల్లాలో 23 మండలాల పరిధిలో 106 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ ఉంది.. తక్షణమే నీటి పరీక్షలు చేయించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని, అధికారులను ఆదేశించారు.

Published : 06 Dec 2022 02:26 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో 23 మండలాల పరిధిలో 106 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ ఉంది.. తక్షణమే నీటి పరీక్షలు చేయించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఫ్లోరైడ్‌కు సంబంధించి వైద్య, ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లా మ్యాప్‌లో ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలను చుక్కలతో కనబరిచేలా ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లోరైడ్‌ సమస్యకు కారణాలను పొందుపరుస్తూ వచ్చే వారానికి పవర్‌ పాయింట్‌ ప్రదర్శన సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డా.రామగిడ్డయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బి.నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు, జిల్లా ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ డా.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మండలస్థాయి అధికారులు చురుకుగా పనిచేయాలి

ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించేలా మండలస్థాయి అధికారులు చురుకుగా పనిచేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను చైతన్యపరిచి నిర్మాణాల్లో పురోగతి సాధించిన పత్తికొండ, గూడూరు, ఆస్పరి మండలాల అధికారులను కలెక్టర్‌ అభినందించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లనిర్మాణాల్లో పురోగతి చూపని హౌసింగ్‌ ఏఈల నుంచి వివరణ తీసుకోవాలని హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణను ఆదేశించారు.    జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అందుకు సంబంధించిన నివేదికలను తెప్పించుకోవాలని డీఈవో రంగారెడ్డిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని