logo

పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం

పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నంద్యాల పట్టణం సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న కశెట్టి రమేశ్‌బాబు, విజయ్‌వెంకట్‌ తన నుంచి రూ.7.15 లక్షలు తీసుకుని మోసం చేశారని పాణ్యం మండలానికి చెందిన రాజశేఖర్‌ ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

Published : 06 Dec 2022 02:26 IST

సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నంద్యాల పట్టణం సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న కశెట్టి రమేశ్‌బాబు, విజయ్‌వెంకట్‌ తన నుంచి రూ.7.15 లక్షలు తీసుకుని మోసం చేశారని పాణ్యం మండలానికి చెందిన రాజశేఖర్‌ ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.  జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన నిర్వహించారు.   రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని హరిహర సీడ్స్‌ కంపెనీ యజమానులకు విక్రయించగా రూ.7.45 లక్షలు చెల్లించకుండా మోసం చేశారని రుద్రవరం మండలం చిత్తరేణిపల్లికి చెందిన బాలచంద్రుడు ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ రమణ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని