నిధులివ్వరు.. మాటకు విలువ ఉండదు
గత రెండు సమావేశాల్లో తాము చెప్పిన సమస్యలు పట్టించుకోలేదు.. కనీసం అధికారులు ప్రతిపాదనలు రూపొందించలేదు.. పలు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలను ప్రస్తావించినా క్షేత్రస్థాయిలో విచారణ చేయలేదు..
సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదన
సభకు హాజరుకాని ఎమ్మెల్యేలు, ఎంపీలు
సభలో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన, కలెక్టర్లు కోటేశ్వరరావు, మనజీర్ జిలానీ
గత రెండు సమావేశాల్లో తాము చెప్పిన సమస్యలు పట్టించుకోలేదు.. కనీసం అధికారులు ప్రతిపాదనలు రూపొందించలేదు.. పలు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలను ప్రస్తావించినా క్షేత్రస్థాయిలో విచారణ చేయలేదు.. ఇలాంటి సమావేశాలు ఎందుకని జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వరు.. మాటకు విలువ ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్లు కోటేశ్వరరావు, మనజీర్ జిలానీ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఉప సీఈవో సుబ్బారెడ్డితోపాటు వివిధ శాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. ఏడాది నుంచి ‘గౌరవం లేదు.. వేతనం లేదని’ ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చింది ఇద్దరే
సమావేశానికి ఎమ్మెల్యేలు బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ జె.సుధాకర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జడ్పీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన సమావేశాలకు జిల్లాలోని ఇద్దరు ఎంపీలు హాజరు కాలేదు. ఒక్కో ఎంపీ పరిధిలో ఏడాదికి రూ.5 కోట్ల (ఎంపీ ల్యాడ్స్) నిధులు కేంద్రం కేటాయిస్తుంది. ఇలాంటి సమావేశాలకు హాజరైతే ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించే ప్రజా సమస్యల పరిష్కారానికి తమ కోటా నుంచి నిధులు విడుదల చేసేందుకు అవకాశముంటుంది.
-న్యూస్‌టుడే, కర్నూలు జడ్పీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు