పోలీసులు న్యాయం చేయలేదని ఆత్మహత్యాయత్నం
ఇంటి ముందు మెట్లు అడ్డుగా ఉన్నాయంటూ పక్కింటి వాళ్లు ఘర్షణకు దిగి ఇంట్లోని వారందరినీ చితకబాదారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రఫీ
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : ఇంటి ముందు మెట్లు అడ్డుగా ఉన్నాయంటూ పక్కింటి వాళ్లు ఘర్షణకు దిగి ఇంట్లోని వారందరినీ చితకబాదారు.. ఈ దౌర్జన్యంపై పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఆసుపత్రి ఆవరణలోనే బాధితుడు శరీరంపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్పాలడిన సంఘటన గురువారం జిల్లా కేంద్రం నంద్యాలలో చోటుచేసుకుంది. బాధితుడు రఫీ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రఫీ ఇంటి మెట్లు ముందుకు ఉన్నాయని, వాటిని తొలగించాలని అదే గ్రామానికి చెందిన ఖాసీం మూడు రోజుల కిందట వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత అదేరోజు రాత్రి ఖాసీం, వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీరెడ్డి, రహీం, ముత్తు, మరో ఆరుగురు యువకులు వచ్చి రఫీతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ కొట్టి గాయపరిచారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తానని ఖాసీం బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా వైకాపా నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. తమకు చావే శరణ్యమంటూ రఫీ గురువారం నంద్యాల సర్వజన ఆసుపత్రి ఆవరణలో డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వెంటనే పక్కనున్న వారు మంటలను ఆర్పివేయడంతో రఫీ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, తమ కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రఫీ డిమాండ్ చేశారు. ఈ విషయమై నంద్యాల గ్రామీణ సీఐ మురళీమోహన్రావును వివరణ కోరగా.. కొత్తపల్లెలో ఇరువర్గాలు ఘర్షణ పడిన వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండు చేస్తున్నారని తెలిపారు. వాళ్లు చెప్పినట్లు కేసు నమోదు చేయలేదని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సరికాదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!