logo

రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పత్తికొండ శివారులోని ఆదోని- గుత్తి బైపాస్‌ రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతిచెందగా  మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 09 Dec 2022 03:44 IST

రాంబాబు (పాత చిత్రం)

పత్తికొండ గ్రామీణం, ఆస్పరి, న్యూస్‌టుడే: పత్తికొండ శివారులోని ఆదోని- గుత్తి బైపాస్‌ రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతిచెందగా  మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన స్నేహితులు రాంబాబు, జాఫర్‌వలి వ్యక్తిగత పనులపై పత్తికొండకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. వారు వెళ్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న బొలోరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాంబాబు(28) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడు జాఫర్‌వలి తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. రాంబాబుకు భార్య గంగావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గాలిమరల సంస్థలో పర్యవేక్షణాధికారిగా పనిచేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు.


అనుమానాస్పదస్థితిలో ఒకరు..

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు మండలం వెంకాయపల్లెకు చెందిన సందెపోగు ఆంజనేయులు (37) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. అతను తన స్నేహితుడు మద్దిలేటితో కలిసి పడిదంపాడు వద్ద తుంగభద్ర నదిలో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లి కనిపించకుండా పోయారు. గురువారం ఉదయం ఆంజనేయులు నదిలో శవమై కనిపించగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని భార్య వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని