logo

సిలిండర్‌ లీకేజీతో మంటలు చెలరేగి మృతి

బతుకుతెరువు కోసం వలస వెళ్లిన ఓ కుటుంబాన్ని అగ్నిప్రమాదం అతలాకుతలం చేసింది.

Published : 09 Dec 2022 03:44 IST

చిన్ననరసయ్య (పాతచిత్రం)

గోనెగండ్ల, న్యూస్‌టుడే: బతుకుతెరువు కోసం వలస వెళ్లిన ఓ కుటుంబాన్ని అగ్నిప్రమాదం అతలాకుతలం చేసింది. ఇంటి పెద్ద మృతి చెందగా, భార్య, రెండో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరంలోని అమీర్‌పేట్‌లో జరిగింది. బాధితుల బంధువుల కథనం ప్రకారం.. గోనెగండ్లకు చెందిన చిన్ననరసయ్య(52), నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయి చేసిన అప్పులు తీర్చుకునేందుకు 20 ఏళ్ల క్రితం హైదరాబాదుకు వలసవెళ్లారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గ్రామంలో జరిగే పండగలు, శుభకార్యాలకు వచ్చి వెళ్తున్నారు. పదేళ్ల క్రితం విద్యుదాఘాతంతో పెద్ద కుమారుడు హైదరాబాదులో మృతిచెందాడు. మంగళవారం తెల్లవారుజామున చిన్ననరసన్న టీ కోసం గ్యాస్‌ స్టవ్‌ వెలిగించారు. ప్రమాదవశాత్తు సిలిండర్‌లోని గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఆయనతోపాటు భార్య నాగలక్ష్మి, చిన్నకుమారుడు గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక వెల్‌నెస్‌ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం చిన్ననరసన్న మృతి చెందాడు, నాగలక్ష్మి, గని పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని