logo

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

చేయి చేయి కలిపి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు.

Published : 09 Dec 2022 03:44 IST

సమావేశం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : చేయి చేయి కలిపి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం నంద్యాల మండల తెదేపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా వైకాపా ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మద్దతు కూడగట్టాలన్నారు. మండల కన్వీనర్‌ గురునాథరెడ్డి, పార్లమెంటు తెదేపా అధికార ప్రతినిధి నరేంద్రకుమార్‌రెడ్డి, పార్లమెంటు తెదేపా కార్యాలయ కార్యదర్శి చిలుకూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు