యాత్రికుల బస్సుకు రూ.4.84 లక్షల జరిమానా
వేరే వాహనానికి చెందిన నంబరుతో తిరుగుతున్న టూరిస్టు బస్సును పట్టుకుని సీజ్ చేసినట్లు ఎంవీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు.
పత్రాలను పరిశీలిస్తున్న ఎంవీఐ క్రాంతికుమార్
డోన్ పట్టణం, న్యూస్‌టుడే: వేరే వాహనానికి చెందిన నంబరుతో తిరుగుతున్న టూరిస్టు బస్సును పట్టుకుని సీజ్ చేసినట్లు ఎంవీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. బెంగళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్న యూపీ టూరిస్టు బస్సును తనిఖీ నిమిత్తం ఆపేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు చోదకుడు జీప్సింగ్ సిబ్బందిపైకి దూసుకెళ్లే విధంగా భయాందోళనకు గురిచేసి తప్పించుకోవాలని చూసినట్లు ఎంవీఐ తెలిపారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ సిబ్బంది సాయంతో బస్సును నిలిపివేయడంతో ఆ ప్రాంతానికి వెళ్లి బస్సుకు సంబంధించిన పత్రాలను పరిశీలించామన్నారు. ఈ బస్సుకు ఎఫ్‌సీ, పర్మిట్, ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి వాటికి 2020లో గడువు ముగిసినట్లు తెలిపారు. వేరే బస్సు నంబరు ప్లేటును ఈ బస్సుకు తగిలించుకుని వెళ్తున్నారని, బస్సు కింది భాగంలో ఉన్న చాపీ నంబరును కంప్యూటర్లో పరిశీలించి గుర్తించామన్నారు. రూ.4,84,545 జరిమానా విధించామన్నారు. బస్సులోని 41 మంది కార్మికులను దించి, ఆ బస్సును డోన్‌కు పంపించి సీజ్ చేసినట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు