logo

ఆళ్లగడ్డ గ్రామీణ సీఐపై చర్యలు తీసుకోవాలి : అఖిలప్రియ

ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు.

Published : 09 Dec 2022 03:44 IST

మాట్లాడుతున్నతెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సీఐ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నె గ్రామానికి చెందిన బీసీ మహిళ జ్యోతి ఒక సెంటు స్థలంలో కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని ప్రోద్బలంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా అధికారులు వారం రోజుల సమయం ఇచ్చి నోటీసులు ఇస్తామని తెలిపినా సీఐ ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారని ఆమె ఆరోపించారు. గురువారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసి స్టే ఆర్డరు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఎస్పీ విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని