logo

అన్నాదమ్ముళ్లు.. కత్తియుద్ధంలో యోధులు

నంద్యాల పట్టణానికి చెందిన అన్నాదమ్ముళ్లు ఫెన్సింగ్‌లో క్రీడలో అద్భుత ప్రతిభ చూపుతున్నారు.

Published : 09 Dec 2022 03:44 IST

ఫెన్సింగ్‌లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

మహిజిత్‌, చరణ్‌జిత్‌

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల పట్టణానికి చెందిన అన్నాదమ్ముళ్లు ఫెన్సింగ్‌లో క్రీడలో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. ప్రభుత్వ విద్యాలయంలో చదువుతున్నా.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో సత్తా చాటుతున్నారు. రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై తల్లిదండ్రులు, పాఠశాలకు గుర్తింపు తెచ్చారు.

* నంద్యాల పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన జయలక్ష్మి, మల్లికార్జున దంపతుల కుమారులు మహిజిత్‌, చరణ్‌జిత్‌. స్థానిక ఆదర్శ పాఠశాలలో మహిజిత్‌ 9, చరణ్‌జిత్‌ 7వ తరగతి చదువుతున్నారు. క్రీడల పట్ల వీరికున్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఇద్దరికీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో ఫెన్సింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణలో మెలకువలు నేర్చుకుని.. నిత్యం సాధన చేస్తూ ఆటపై పట్టు సాధించారు. పోటీల్లో పాల్గొంటూ పలు విజయాలు సాధించారు.

మహిజిత్‌ విజయాలు

* 2021లో నంద్యాలలో ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.
* 2021లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో వెండి పతకం.
* ఈ ఏడాది జులైలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్యం, ప్రశంసా పత్రం.
* గత డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌-18 ఫెన్సింగ్‌ పోటీల్లో కాంస్యం పతకం.

చరణ్‌జిత్‌ అందుకున్న పతకాలు

* 2021లో కాకినాడలో జరిగిన ఫెన్సింగ్‌ పోటీల్లో వెండి పతకం.
* కాకినాడలో ఈనెల 4, 5, 6వ తేదీల్లో నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల క్యాడెట్‌ ఛాంపియన్‌ షిప్‌ అండర్‌-14 విభాగంలో రజతం.
* అదే టోర్నమెంట్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం.
* జనవరి 2023లో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని