logo

నాడు సేవలు.. నేడు మూలకు

కొన్నేళ్ల పాటు పల్లెలకు సేవలందించాయి.. మూడేళ్లుగా మూలకు చేరాయి. పట్టించుకోని పాలకులు.. దృష్టిసారించని యంత్రాంగం.. వెరసి 104 వాహనాలు కదలడం లేదు.

Published : 20 Jan 2023 01:55 IST

 ఉమ్మడి జిల్లాలో తుప్పు పడుతున్న 104 వాహనాలు

ఆదోని ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో మూలనపడిన 104 వాహనం

కొన్నేళ్ల పాటు పల్లెలకు సేవలందించాయి.. మూడేళ్లుగా మూలకు చేరాయి. పట్టించుకోని పాలకులు.. దృష్టిసారించని యంత్రాంగం.. వెరసి 104 వాహనాలు కదలడం లేదు.  ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా సుమారు 20 వాహనాలు మూలన పడున్నాయి. గతంలో పీహెచ్‌సీల వారీగా వీటి ద్వారా సేవలందించారు. ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున కొత్తగా 104 వాహనాలు రావడంతో పాత వాటిని మూలన పెట్టేశారు. గతంలో 4-7 పీహెచ్‌సీలకు కలిపి ఒక్క సీహెచ్‌ఎన్‌సీ (క్లస్టర్‌ హెల్త్‌ న్యూట్రిషన్‌ సెంటర్‌) కేంద్రంగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 20 సీహెచ్‌ఎన్‌సీలకు 20 వాహనాలు నడిపారు. కొత్త వాహనాలు రావడంతో ఇవన్ని ఆయా ఆసుపత్రుల ఆవరణలో మూలకు నెట్టేశారు.

న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని