గాలిపటం ఎగరవేస్తూ విద్యుదాఘాతానికి గురి
డోన్ పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన శివశంకర్ ఆచారి అనే విద్యార్థి విద్యుదాఘాతానికి గురైన ఘటన చోటుచేసుకుంది.
తీవ్ర గాయాలకు గురైన శివశంకర్ ఆచారి
డోన్, న్యూస్‌టుడే: డోన్ పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన శివశంకర్ ఆచారి అనే విద్యార్థి విద్యుదాఘాతానికి గురైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టీఆర్ నగర్‌కు చెందిన బ్రహ్మయ్య ఆచారి కుమారుడు శివశంకర్ ఆచారి శుక్రవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం సరదాగా ఇంటిపైకి వెళ్లి గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే బాలుడిని రక్షించారు. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం డోన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
ఈతకు వెళ్లి యువకుడి మృతి
పెద్దవంగలి (చాగలమర్రి), న్యూస్‌టుడే: మండలంలోని పెద్దవంగలి గ్రామంలో ఈతకు వెళ్లి వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లకు చెందిన షేక్ రియాజ్ (17) అనే యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. యర్రగుంట్ల గ్రామానికి చెందిన గఫార్ ఉస్మాని మూడో కుమారుడు షేక్ రియాజ్ తమ బంధువుల పుట్టువెంట్రుకల శుభకార్యానికి పెద్దవంగలి దర్గాకు వచ్చారు. అక్కడ తోటి బంధువులతో కలిసి సరదాగా సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లారు. అక్కడ బావిలో మునిగి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చాగలమర్రి ఎస్సై రమణయ్య పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/01/23)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు