logo

నేడు కానిస్టేబుళ్ల నియామక రాత పరీక్ష

కానిస్టేబుళ్ల రాతపరీక్షకు సంబంధించి బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు.

Published : 22 Jan 2023 01:24 IST

సూచనలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కానిస్టేబుళ్ల రాతపరీక్షకు సంబంధించి బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ఆదేశించారు. కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం 48 కేంద్రాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు కవాతు మైదానంలో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులకు హాజరయ్యే 350 మంది పోలీసు సిబ్బందితో ఎస్పీ శనివారం సమావేశమై పలు సూచనలు ఇచ్చారు. అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేయాలన్నారు. పరీక్ష కేంద్రం నుంచి 200 మీటర్ల పరిధి వరకు జిరాక్స్‌ సెంటర్లు తెరవకుండా చూడాలని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించకూడదని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రసాద్‌, రీజనల్‌ కోఆర్డినేటర్‌.. పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు వెంకట్రామయ్య, నాగభూషణం, శ్రీనివాసులు, కె.వి.మహేష్‌, యుగంధర్‌బాబు, దేవకుమార్‌, రామారావు, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

కర్నూలు ఆర్టీసీ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో 8 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటరామం శనివారం తెలిపారు. ఈ బస్సులు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాల, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాల వైపు నడుస్తాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష సమయం వరకు, పరీక్ష అయిపోయిన వెంటనే ఆ కేంద్రం నుంచి బస్టాండ్‌ వరకు నడుస్తాయన్నారు. ఈ బస్సులో టిక్కెట్‌ ధర రూ.20గా నిర్ణయించామన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని