logo

గడప గడపకు ఆలస్యంపై ఎమ్మెల్యే చిర్రుబుర్రు

‘కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలవ్వాలి. ఎన్నింటికి వస్తున్నారు. సమయానికి రావడానికి రాదా? ఇలాగే చేస్తే.. శని, ఆదివారాలు కూడా నిర్వహిస్తాం చూడండి’.

Published : 26 Jan 2023 01:49 IST

సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ‘కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలవ్వాలి. ఎన్నింటికి వస్తున్నారు. సమయానికి రావడానికి రాదా? ఇలాగే చేస్తే.. శని, ఆదివారాలు కూడా నిర్వహిస్తాం చూడండి’. అని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సచివాలయ ఉద్యోగులపై చిర్రుబుర్రులాడారు. బుధవారం ఉదయం 9గంటలకు నిర్వహించాల్సిన గడప గడపకు.. మన ప్రభుత్వ కార్యక్రమం 11గంటలకు ప్రారంభిస్తే.. ఎలా అని ప్రశ్నించారు. ఆదోని పట్టణంలోని నాలుగోవ వార్డులో ఎమ్మెల్యే పర్యటనకు వెళ్లే సమయంలో సచివాలయ ఉద్యోగులు కనిపించారు. ఇంత ఆలస్యమైతే ఎలా? మేము గడప గడపకు కార్యక్రమంలో తిరగలేక ఇబ్బందులు పడుతుంటే.. మీరు కూడా ఇలా ఆలస్యంగా వస్తే ఎలా అన్నారు. ఇలాగైతే సెలవు రోజుల్లో సైతం వదలకుండా కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం వార్డులో తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని