logo

వాలీబాల్‌ బాలబాలికల విజేత శ్రీకాకుళం, గుంటూరు జట్లు

కర్నూలు ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 66వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల వాలీబాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి.

Published : 26 Jan 2023 01:49 IST

మూడో స్థానంలో నిలిచి జ్ఞాపిక అందుకుంటున్న కర్నూలు క్రీడాకారులు

కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: కర్నూలు ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 66వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల వాలీబాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో జరిగిన తుది పోరులో శ్రీకాకుళం జట్టు.. పశ్చిమ గోదావరిపై 25-20, 25-23 స్కోరుతో గెలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది. కర్నూలు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో గుంటూరు జట్టు.. విశాఖపై 25-23, 25-21 స్కోరుతో గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకుంది. మూడో స్థానంలో విజయనగరం జట్టు నిలిచింది. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డా.రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అవినాష్‌ జయసింహా తదితరులు కలిసి బహుమతులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని