logo

రూ.2.50 లక్షల డ్రిప్‌ పరికరాల పట్టివేత

వ్యవసాయ పొలాల్లో రైతులకు సంబంధించి డ్రిప్‌ పరికరాలను చోరీ చేసి వాహనంలో తీసుకెళ్తుండగా జలదుర్గం ఎస్సై, పోలీసులు గుర్తించి పట్టుకుని, దుండగులను అరెస్టు చేసిన సంఘటన మండలంలోని గార్లదిన్నె గ్రామంలో జరిగింది.

Published : 26 Jan 2023 01:49 IST

8 మంది వ్యక్తులు అరెస్టు, మరొకరి పరారీ

నిందితులను చూపుతున్న పట్టణ సీఐ, జలదుర్గం ఎస్సై, సిబ్బంది

ప్యాపిలి, న్యూస్‌టుడే: వ్యవసాయ పొలాల్లో రైతులకు సంబంధించి డ్రిప్‌ పరికరాలను చోరీ చేసి వాహనంలో తీసుకెళ్తుండగా జలదుర్గం ఎస్సై, పోలీసులు గుర్తించి పట్టుకుని, దుండగులను అరెస్టు చేసిన సంఘటన మండలంలోని గార్లదిన్నె గ్రామంలో జరిగింది. దీనిపై ప్యాపిలి ఠాణాలో బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ సీఐ శ్రీరాములు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుంచి కొంతమంది గుర్తుతెలియని దుండగులు రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల్లో బిందు(డ్రిప్‌) పరికరాలను కోసి, తీసుకెళ్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిపై జలదుర్గంలో మూడు కేసులు, ప్యాపిలిలో రెండు కేసులు, డోన్‌ గ్రామీణ పరిధిలో ఒక కేసు చొప్పున నమోదు చేశారు. జలదుర్గం ఎస్సై నరేష్‌, సిబ్బందితో వాహనాల తనిఖీ చేపడుతుండగా, ఆ సమయంలో బొలెరోలో డ్రిప్‌ పరికరాలు వేసుకుని వెళ్తుండటాన్ని గమనించారని తెలిపారు. వాహనాన్ని గార్లదిన్నె గ్రామం వద్ద నిలిపి వారిని విచారించినట్లు పేర్కొన్నారు. ఇందులో వారితోపాటు మరికొందరు డ్రిప్‌ పైపులను చోరీ చేసినట్లు వెల్లడైందన్నారు. దీంట్లో 9 మంది పాల్గొనగా వారిలో 8 మందిని అరెస్టు చేశామన్నారు. మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని, అతను పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా ప్యాపిలి, తుగ్గలి మండలానికి చెందిన వ్యక్తులని తెలిపారు. డ్రిప్‌ పైపుల విలువ రూ. 2.50 లక్షలు ఉంటుందన్నారు. వారిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై, పోలీసు సిబ్బందిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని