logo

జగన్‌ పాలనకు ముగింపు పలకాలి

యువగళం పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం కడప పెద్దదర్గాలో ప్రార్థనలు చేశారు.

Updated : 26 Jan 2023 02:33 IST

లోకేశ్‌ను కలిసిన తెదేపా నాయకులు

లోకేశ్  మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : యువగళం పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  బుధవారం కడప పెద్దదర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాలకు చెందిన పలువురు తెదేపా నాయకులు కడపకు తరలివెళ్లారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్  , మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు, తెదేపా లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీడీ హుసేన్‌బాబు, నాయకులు, కార్యకర్తలు వెళ్లారు.

కడప పెద్ద దర్గాలో నారా లోకేశ్  సన్మానిస్తున్న నంద్యాల పార్లమెంటు

తెదేపా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌

బేతంచెర్ల, న్యూస్‌టుడే: జగన్‌ అవినీతి పాలనకు ప్రజలు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెదేపా డోన్‌ నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో 7వ వార్డులో పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, పాలశేఖర్‌ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, అడ్డంకులు చేసినా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కొనసాగుతుందన్నారు. డోన్‌లో తెదేపా జెండా ఎగురవేయడానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, జాకీరుల్లాబేగ్‌, ఉన్నం సుధాకర్‌, రవీంద్ర నాయక్‌, తిరుమలేష్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఇదేం ఖర్మ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారెడ్డి

కడపకు తరలివెళ్లిన తెదేపా నాయకులు

చాగలమర్రి, న్యూస్‌టుడే: కడప జిల్లాకు వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌కు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. చాగలమర్రి పట్టణ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద చాగలమర్రి తెదేపా నాయకులు భారీ ఎత్తున చేరి మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో కలసి కడపకు వెళ్లారు. లోకేశ్‌ చేపడుతున్న యువగళం కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని తెలిపారు.

చాగలమర్రి టోల్‌ ప్లాజా వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని