logo

యువగళం విజయవంతానికి ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ గురువారం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి

Updated : 27 Jan 2023 06:32 IST

ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్న తెదేపా జిల్లా నాయకులు

కౌతాళం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ గురువారం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి, 101 కొబ్బరి కాయలను కొట్టారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌రెడ్డి, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబస్సప్ప, ఉరుకుంద ఈరన్నస్వామి ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షుడు బాపురం శివమోహన్‌రెడ్డి, వెంకటపతిరాజు, కురుగోడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు కలిసి యువగళం గోడపత్రాలను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు. నాయకులు రమేష్‌గౌడు, రహిమాన్‌, దర్గామౌలా, వడ్డె ఉసేని, రారావి మల్లప్పగౌడు తదితరులు పాల్గొన్నారు.  


కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : లోకేశ్‌ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గుంటూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య మిత్రులతో కలిసి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. లోకేశ్‌ తన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని