logo

సమరయోధుల త్యాగాలు స్మరించుకుందాం

సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి అన్నారు.

Updated : 27 Jan 2023 06:34 IST

జెండాకు వందనం చేస్తున్న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, అధికారులు
వందనం చేస్తున్న హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి అన్నారు. నగర పరిధిలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న హెచ్‌ఆర్‌సీ కార్యాలయంలో గురువారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. హెచ్‌ఆర్‌సీ కమిషన్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు సంతోష్‌నగర్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్త కార్యదర్శి ఎం.అమరేంద్రరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ (లీగల్‌) మురళీ మోహన్‌రెడ్డి, రిజిస్టార్‌ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోలయ్య, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా కోర్టు వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎ.శ్రీనివాసకుమార్‌, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి పాండురంగారెడ్డి, మహిళా కోర్టు జడ్జి భూపాల్‌రెడ్డి, సీబీఐ కోర్టు జడ్జి వెంకటరమణ, ఏసీబీ కోర్టు జడ్జి సునీత, సబ్‌ జడ్జిలు సీహెచ్‌వీఎన్‌ శ్రీనివాసరావు, దివాకర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు షర్మిల, జ్యోత్న్సాదేవి, కె.భార్గవి, వందన, కల్యాణి, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌లు వెంకట్రామిరెడ్డి, రత్నం, అల్లాబకాష్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఆర్‌కృష్ణ, కార్యదర్శి కాటం రంగడు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని