logo

హామీల అమల్లో కేంద్రం విఫలం

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని.. ఆయన్ను ఇంటికి సాగనంపాలని రైతు సంఘం రాష్ట్ర నేత రామచంద్రయ్య  అన్నారు.

Published : 27 Jan 2023 05:35 IST

నిరసన తెలుపుతున్న అఖిల పక్ష రైతు సంఘం నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని.. ఆయన్ను ఇంటికి సాగనంపాలని రైతు సంఘం రాష్ట్ర నేత రామచంద్రయ్య  అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు గురువారం బైక్‌, ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ విద్యుత్తు సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని, రుణమాఫీ చేయాలని, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.5 వేలు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు నరసింహులు, విశ్వనాథరెడ్డి, రైతు స్వరాజ్య ఐక్యవేదిక జిల్లా నాయకులు నాగన్న, ఖాదర్‌, సీపీఐ నేతలు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, విద్యార్థి సంఘం నేత రాఘవేంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా నేత కృష్ణ, మాజీ సర్పంచి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని