logo

ఆదోని పట్టణంలో తెదేపా ర్యాలీ

రాష్ట్రంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేటపట్టిన యువగళం పాతయాత్రకు సంఘీభావంగా ఆదోని పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Updated : 27 Jan 2023 17:12 IST

ఆదోని మార్కెట్‌: రాష్ట్రంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేటపట్టిన యువగళం పాతయాత్రకు సంఘీభావంగా ఆదోని పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు యాత్ర కొనసాగింది. ప్రజలు అధికార పార్టీ పాలనతో విసుగెత్తిపోయారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పాదయాత్ర తెదేపాకు మరింత ఊపును ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు రంగస్వామి, సిద్ధార్థ నాయుడు, బాలాజీ, హుస్సేన్‌ తదితరులు ఉన్నారు. లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. విక్టోరియాపేట రామాలయంలో తెదేపా నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కృష్ణమ్మ, నాయకులు తదితరులు ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని