ప్రాథమిక పాఠానికి సర్దుపాట్లు
ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక విద్యను ప్రశ్నార్థకంగా మార్చాయి. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక విద్యను ప్రశ్నార్థకంగా మార్చాయి. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఉమ్మడి జిల్లాలో 1404 మంది ఉపాధ్యాయులను పదోన్నతులతో బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం 70 శాతం పదోన్నతులు, 30 శాతం నేరుగా నియామకాలు చేపట్టాలి. నిబంధనలు పాటించకపోవడం ప్రాథమిక విద్యపై ప్రభావంపై పడింది. ఎస్జీటీల కొరత ఉండటంతో మూడో తరగతి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5వ తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలించింది. ఎస్జీటీలకు పదోన్నతుల పేరుతో నిర్వహించిన క్రతువుతో చాలా పాఠశాలల్లో బోధన కరవయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 25 మంది విద్యార్థుల సంఖ్య దాటితే మరో ఉపాధ్యాయున్ని నియమించాలనే నిబంధన ఉండగా, ప్రస్తుతం జరిగిన పదోన్నతులతో చాలా పాఠశాలల్లో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉండగా ఏకోపాధ్యాయుడే బోధన చేయాల్సిన పరిస్థితులొచ్చాయి.
ఐదు తరగతులకు ఒక్కరే
పాఠశాలలో ఒకే ఉపాధ్యాయురాలు
గోనెగండ్ల ప్రాథమిక పాఠశాల(బీసీ)లో ఐదో తరగతి వరకు 65 మంది చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతి రావడంతో మరో చోటికి బదిలీ అయ్యారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో శుక్రవారం అత్యవసరంగా డిప్యుటేషన్‌పై ఓ ఉపాధ్యాయురాలిని నియమించారు. ఆమె ఐదు తరగతులకూ బోధించలేక ఇబ్బంది పడ్డారు. రెండు గదులున్నా., ఒక గదిలో నిర్మాణ సామగ్రి ఉంచడంతో మరో గదిలో, వరండాలోనూ పిల్లలను ఉంచి పాఠాలు చెప్పాల్సి వచ్చింది. మరో ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్‌టుడే, గోనెగండ్ల
ఎక్కడెక్కడ ఎలా ఉందంటే
* దేవనకొండ మండలం మాదాపురం, జిల్లెడబుడకల ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి ఏర్పడింది. బండిఆత్మకూరు మండలం బరకాల, కడమలకాల్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు రాగా ఇక్కడ డిప్యుటేషన్‌పై ఎస్జీటీలను పంపించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు.
* వెలుగోడు మండలంలో 11 మంది పదోన్నతులపై వెళ్లగా నలుగురు ఉపాధ్యాయులను ఆయా స్థానాల్లో భర్తీ చేశారు. బోయరేవుల పాఠశాలల్లో 76 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు పదోన్నతిపై వెళ్లగా ఇద్దరు మిగిలారు.
* పాణ్యం మండలం వొడ్డుగండ్ల ప్రాథమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులుండగా, ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు పదోన్నతిపై వెళ్లగా ఒక్కరే మిగిలారు. నెరవాడ పాఠశాల నుంచి ఒకరు పదోన్నతిపై వెళ్లగా 45 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్.కొత్తూరు పాఠశాలలోనూ ఇదే పరిస్థితి.
* గడివేముల మండలం గగ్గటూరులో ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరికి పదోన్నతి లభించగా మరో ఉపాధ్యాయుడు అవసరం ఏర్పడింది. ఈ మండలంలో ఆరు చోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!
-
Sports News
Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్