logo

పుర కార్యాలయంలో అనిశా తనిఖీలు

నంద్యాల పురపాలక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అనిశా(అవినీతి నిరోధకశాఖ) తనిఖీలు జరిగాయి. కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో తనిఖీలు నిర్వహించి దస్త్రాలు పరిశీలించారు.

Published : 28 Jan 2023 01:48 IST

పట్టణ ప్రణాళిక విభాగంలో దస్త్రాలు పరిశీలిస్తున్న అనిశా అధికారులు

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే: నంద్యాల పురపాలక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అనిశా(అవినీతి నిరోధకశాఖ) తనిఖీలు జరిగాయి. కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో తనిఖీలు నిర్వహించి దస్త్రాలు పరిశీలించారు. సర్వేయర్‌ వద్ద 46 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. నెలలు గడుస్తున్నా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడంపై ఆరా తీశారు. పురపాలక కమిషనర్‌ రవిచంద్రారెడ్డితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం వరకు తనిఖీలు కొనసాగుతాయని, అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. దాడుల్లో అధికారులు ఇంతియాజ్‌బాషా, కృష్ణారెడ్డి, వంశీనాథ్‌, కృష్ణయ్యతోపాటు పది మంది సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదుతో దాడులు

నంద్యాల పురపాలక కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు, ఫైల్‌ కదలాలంటే ముడుపులు చెల్లించాలని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చినా అవినితి తగ్గలేదని, సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అనంతరం పురపాలక కార్యాలయంలో అనుమతులు ఇవ్వడానికి ముడుపులే ప్రధామన్న చర్చ జరుగుతుంది. టోల్‌ఫ్రీ 14400కు ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహించినట్లు అనిశా అధికారులు పేర్కొంటున్నారు. తమ పనులకు డబ్బులు ఇవ్వవద్దని, ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవాలని డీఎస్పీ శివనారాయణస్వామి కోరారు. ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్‌ చేసినా వెంటనే టోల్‌ఫ్రీకి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని