మా పొలంపై వైకాపా నేతల కన్ను
వైకాపా నాయకుడు మహంతేష్‌స్వామి తమ పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వదిలేయాలంటూ బెదిరిస్తున్నారని, పోలీసులూ సరిగా స్పందించడంలేదని కర్నూలు జిల్లా కోసిగిలో బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు.
వదిలేయాలంటూ బెదిరించారని బాధితుల ఆవేదన
కోసిగిలో విలేకరులతో మాట్లాడుతున్న బాధిత కుటుంబ సభ్యులు, తెదేపా నాయకులు
కోసిగి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుడు మహంతేష్‌స్వామి తమ పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వదిలేయాలంటూ బెదిరిస్తున్నారని, పోలీసులూ సరిగా స్పందించడంలేదని కర్నూలు జిల్లా కోసిగిలో బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు. శుక్రవారం కోసిగి మండలం దుద్ది గ్రామానికి చెందిన జొక్కల రమేశ్, తిమ్మక్క మాట్లాడుతూ... ‘గ్రామంలో సర్వే నంబర్లు 55, 56లలో 6.93 ఎకరాల భూమిని మేము కొనుగోలు చేశాం. పట్టా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అయితే... వైకాపా నాయకులైన మఠం బ్రదర్స్ మా భూమిని ఆక్రమించుకునేందుకు 30 మంది అనుచరులతో వచ్చి బెదిరిస్తున్నారు. కోసిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే, అక్కడి సిబ్బంది గంటల తరబడి కూర్చోబెట్టారు. ఫిర్యాదు తీసుకోకుండానే పంపేశారు’ అని ఆరోపించారు. ఈమేరకు తెదేపా నాయకులు జ్ఞానేష్, అయ్యన్న, మహాదేవ మాట్లాడుతూ... వైకాపా నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇదే విషయమై ఎస్సై రాజారెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా... ఇరువర్గాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!
-
Sports News
Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్