logo

యువగళంలో జిల్లా నేతలు

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం యువగళం పాదయాత్ర ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన తెదేపా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Published : 28 Jan 2023 01:48 IST

వేదికపై సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బీవీ జయనాగేశ్వర రెడ్డి,  ఆకెపోగు ప్రభాకర్‌, టీజీ భరత్‌, సోమిశెట్టి నవీన్‌ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం యువగళం పాదయాత్ర ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన తెదేపా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, బీటీ నాయుడు, నియోజకవర్గ బాధ్యులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం), టీజీ భరత్‌ (కర్నూలు), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), ఆకెపోగు ప్రభాకర్‌ (కోడుమూరు), డా.బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), మీనాక్షి నాయుడు (ఆదోని), కోట్ల సుజాతమ్మ (ఆలూరు), ధర్మవరం సుబ్బారెడ్డి (డోన్‌) పాల్గొన్నారు. వీరితోపాటు రాష్ట్ర కార్యదర్శులు బత్తిన వెంకటరాముడు, పీజీ నరసింహులు యాదవ్‌, నంద్యాల నాగేంద్రకుమార్‌, వైకుంఠం మల్లికార్జున చౌదరి, పోతురాజు రవికుమార్‌, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీజీ గోపినాథ్‌ యాదవ్‌, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌కుమార్‌, జడ్పీ మాజీ ఛైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, పార్లమెంట్‌ అనుబంధ కమిటీల అధ్యక్షుడు జేమ్స్‌ (ఎస్సీ సెల్‌), రామాంజనేయులు (టీఎన్‌ఎస్‌ఎఫ్‌), సత్రం రామకృష్ణుడు (బీసీ సెల్‌), కోడుమూరు మండల పార్టీ అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ, క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబురాజ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి ఆదాము, పీజీ రాంపుల్లయ్య యాదవ్‌, పి.చిన్న మారెన్న తదితరులు పాల్గొన్నారు.

* యువ గళం పాదయాత్ర బహిరంగసభలో కర్నూలు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు టీజీ భరత్‌ పాల్గొన్నారు. జిల్లా నుంచి వెళ్లిన నేతలతో కలిసిన ఆయన బహిరంగ సభ వేదికపై కూర్చున్నారు.

హాజరైన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోడుమూరు మండల తెదేపా అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ, తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని