logo

కర్షకుల కన్నీటి కష్టాలు

కర్షకునికి ఎంత కష్టమొచ్చినా, ఎంత నష్టమొచ్చినా పుడమి తల్లినే నమ్ముకుని ముందుకు సాగుతాడు. తన పొలంలో పంటలు పండించాలంటే రైతు పడే కష్టం అంతాఇంతా కాదనేందుకు నిదర్శనమే ఈ చిత్రం.

Published : 28 Jan 2023 01:48 IST

బ్రాహ్మణపల్లె వక్కిలేరులో నీటిని తోడుకునేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాక్టర్‌ ఇంజిన్‌

కర్షకునికి ఎంత కష్టమొచ్చినా, ఎంత నష్టమొచ్చినా పుడమి తల్లినే నమ్ముకుని ముందుకు సాగుతాడు. తన పొలంలో పంటలు పండించాలంటే రైతు పడే కష్టం అంతాఇంతా కాదనేందుకు నిదర్శనమే ఈ చిత్రం. మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలో వక్కిలేరు వాగు నుంచి కిలోమీటరు దూరంలోని పొలాలకు కొందరు రైతులు నీటిని మళ్లించుకుంటున్నారు. సాగు చేసిన జొన్న, మినుము, శనగ, పత్తి పంటలు తడవాలంటే కిలోమీటరు మేర పైపులు వేసి నీటిని తరలించాల్సిందేనంటున్నారు. బ్రాహ్మణపల్లె వక్కిలేరులో ట్రాక్టర్‌ ఇంజిన్‌ ద్వారా కి.మీ. మేర పైపులు వేసుకుని కొందరు రైతులు వారి పొలాలకు నీరు పారించుకుంటున్నారు.

 న్యూస్‌టుడే, చాగలమర్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని